Natural Resources Canada logo and Government of Canada logo
Symbole du gouvernement du Canada
పరిశుద్ధమైన శక్తి నిర్ణయాలకు అధికారం కల్పిస్తూ
RETScreen అంటే ఏమిటి?

డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయి *.pdf (1.69 MB)


RETScreen® International
www.retscreen.net

RETScreen Software
బాహ్యవీక్షణం

RETSCREEN క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఎనాలిసిస్ సాఫ్ట్‌వేర్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న క్లీన్ ఎనర్జీ డెసిషన్-మేకింగ్ సాఫ్ట్‌వేర్. వాతావరణ మార్పును పరిష్కరించడంలో సమగ్ర విధానాన్ని అవలంభించాల్సిన అవసరాన్ని కెనడా గుర్తించడం మరియు కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా దీన్ని కెనడా ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. RETScreen ప్రపంచ వ్యాప్తంగా నిరూపించబడ్డ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అందిస్తోంది.

రాబోయే ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ని గుర్తించడం మరియు అంచనా వెయ్యడానికి సంబంధించిన ఖర్చును (ఆర్ధికపరంగా మరియు సమయంలో రెండింటిలో) RETScreen గుర్తించదగ్గ రీతిలో తగ్గిస్తుంది. పూర్వ-సాధ్యత, సాధ్యత, అభివృద్ది, మరియు ఇంజనీరింగ్ దశలలో ఉత్పన్నమయ్యే ఈ ఖర్చులు రెన్యువబుల్-ఎనర్జీ అండ్ ఎనర్జీ-ఎఫిసియెంట్ టెక్నాలజీస్ అమలు చేయటంలో గణనీయమైన అవరోధాలు కాగలవు. ఈ అవరోధాలను తొలగించటానికి సహాయపడటం ద్వారా, ప్రాజెక్టులు ప్రారంభించటానికి మరియు కాలుష్యరహిత ఎనర్జీతో వ్యాపారం చేయటానికి ఖర్చులను RETScreen తగ్గిస్తుంది.

నిర్ణయం తీసుకునేవారు మరియు వృత్తి నిపుణులు ప్రతిపాదిత రెన్యువల్ ఎనర్జీ, ఎజర్జీ ఎఫీసియెన్సీలేదా కోజెనరేషన్‌ ప్రాజెక్టు అర్థికపరంగా అర్థవంతమైనదా కాదా అని నిర్థారించటానికి RETScreen వీలుకల్పిస్తుంది. ఒక ప్రాజెక్టు సాధ్యనీయమైనదా- లేక సాధ్యనీయం కాదా- అనేది అర్థం చేసుకోవటానికి నిర్ణయం తీసుకునేవారికి RETScreen సహాయపడుతుంది: త్వరితంగా, స్పష్టంగా మరియు ఇతరవాటితో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో.

RETScreen:
  • 222 దేశాలు మరియు ప్రదేశాలలో 425, 000 లకు పైగా ప్రజలచే ఉపయోగించబడుతున్నది.
  • ప్రపంచ జనాభాలో 2/3 వంతును కవర్ చేస్తూ 35 భాషలలో అందుబాటులో ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా 600 పైగా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల పాఠ్యప్రణాళికలో భాగంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా $7 బిలియన్ల యూజర్ సేవింగ్స్కు RETScreen ప్రత్యక్షంగా దోహదపడింది, ఈ నంబరు 2013 నాటికి $8 బిలియన్లకు పెరుగగలదని భావిస్తున్నారు. కాలుష్యరహిత ఎనర్జీని అందించగలగటం ద్వారా, RETScreen గ్రీన్ హౌస్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించటానికి అప్రత్యక్షంగా తోడ్పడింది- ఈ తగ్గుదల 2013 నాటికి ఏడాదికి తక్కువలో తక్కువగా 20 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. మరియు 2013 నాటికి, సుమారు $41 బిలియన్ల విలువతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 24 గిగా వాట్ల ఇన్స్టాల్ చేసిన కాలుష్యరహిత ఎనర్జీ సామర్థ్యపు ఇన్స్టలేషన్కు ప్రేరణకలిగించటానికి RETScreen సహాయపడి ఉండగలదు.


ఐదు అంచెల ప్రామాణిక విశ్లేషణ
సాఫ్ట్వేర్ మరియు డేటా

RETScreen తన కోవలో ఒక అత్యంత సమగ్ర ఉత్పత్తి, ఇది ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు మరియు ఆర్థిక ప్రణాళికా కర్తలు ఏదైనా కాలుష్యరహిత ఎనర్జీ ప్రాజెక్టును రూపొందించటానికి మరియు విశ్లేషించటానికి వీలుకలిగిస్తుంది. నిర్ణయం తీసుకునేవారు ఐదు అంచెల ప్రామాణిక విశ్లేషణ, తోసహా ఎనర్జీ విశ్లేషణ, ఖర్చు విశ్లేషణ, ఉద్గారం విశ్లేషణ, ఆర్థిక విశ్లేషణ మరియు సున్నితత్వం/రిస్క్ విశ్లేషణ నిర్వహించగలరు.

RETScreen ప్రాజెక్టు మోడళ్లలో చేర్చబడిన సాంకేతికతలు పూర్తి సమగ్రమైనవి మరియు వీటిలో సాంప్రదాయక మరియు సాంప్రదాయకేతర వనరులు రెండింటితోపాటు ప్రస్తుతం అమలులో ఉన్న ఎనర్జీ వనరులు మరియు సాంకేతికతలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మోడళ్ల శాంపిలింగ్లో ఇవి ఉన్నాయి:ఎనర్జీ సామర్థ్యం (పెద్దపారిశ్రామిక సదుపాయాలనుండి వ్యక్తిగత గృహాలవరకు), హీటింగ్ మరియు కూలింగ్ (ఉదా:బయోమాస్, హీట్ పంప్స్ మరియు సోలార్ వాయు/నీటి హీటింగ్), విద్యుత్తు (సోలార్, పవన, తరంగ, జల, జియోథర్మల్లాంటి రెన్యువబుల్స్ మాత్రమే
కాకుండా గ్యాస్/ఆవిరి టర్బైన్లు మరియు రెసిప్రోకేటింగ్ ఇంజన్లు, మరియు కంబైన్డ్ హీట్
మరియు పవర్ (లేదా కోజనరేషన్) లాంటి సాంప్రదాయక సాంకేతికతలు.

ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ యొక్క సూట్
ఈ విశ్లేషణ టూల్స్లో ఉత్పత్తి, ప్రాజెక్టు, హైడ్రాలజీ మరియు ఉష్ణోగ్రత డేటాబేస్లు (వీటిలో చివరిది ఉపగ్రహం మొత్తం ఉపరితలాన్ని కవర్ చేస్తూ 6,700 గ్రౌండ్-స్టేషన్‌ లొకేషన్లు ప్లస్ NASA శాటిలైట్ డేటాతో), మరియు ప్రపంచవ్యాప్త ఎనర్జీ వనరుల మ్యాప్స్‌కు లింక్స్ పూర్తిగా సమన్వయపరచబడ్డాయి. మరియు, యూజర్ త్వరితంగా విశ్లేషణ ప్రారంభించేలా సహాయపడటానికి, RETScreen జనరిక్ కాలుష్యరహిత ఎనర్జీ యొక్క ఒక విస్తృతమైన ప్రాజెక్టు టాంప్లెట్స్ డేటాబేస్ను ఏర్పాటు చేసింది.

ఈ విధమైన విస్తృత విశ్లేషణ నిర్వహించటంలో సహాయపడే మరే ఇతర టూల్ లేదు.


కాంప్రహెన్సివ్ శిక్షణ మరియు సపోర్ట్ మెటీరియల్
శిక్షణ

శిక్షణ అనేది RETScreen లో ఒక అంతర్గత భాగం. డౌన్లోడ్ చేయబడిన సాఫ్ట్వేర్లో మరియు వెబ్సైట్పై ఒక ప్రసంగం నుండి అనేక దినాల కోర్సు వరకుగల భిన్న నిడివులుగల ఉచిత శిక్షణ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. అన్నీ కలిపి, ఈ శిక్షణ మాడ్యూల్స్ 2-4 వారాల ఇన్టెన్సివ్ లేదా 1-2 సెమిస్టర్ల రెగ్యులర్ కోర్సులను నడపటానికి సరిపోతాయి. ఈ శిక్షణ సామగ్రిలో ఇవి ఉన్నాయి:
  • విస్తృత వెబ్కాస్ట్స్, ప్రజంటేషన్ స్లైడ్స్ మరియు ఇన్స్ట్రక్టర్ నోట్స్;
  • అనేక కేసు అధ్యయనాలు మరియు అసైన్మెంట్స్,వర్క్-ఔట్ చేయబడిన పరిష్కారాలు మరియు వాస్తవ ప్రపంచంలో ప్రాజెక్టులు ఎంతబాగా పనిచేస్తున్నాయి అనేదాన్ని గురించి సమాచారం;
  • ఒక సవివర యూజర్ వివరణ పుస్తకం;
  • ఈ మోడల్స్లో ఉపయోగించిన అల్గోరిథమ్స్ యొక్క సవివర వివరణ అందించేఒక ఇ-టెక్స్ట్బుక్;
  • నమూనా లీగల్ డాక్యుమెంట్లతో సహా క్లీన్ ఎనర్జీ లీగల్ టూల్కిట్

భాగస్వాములు

RETScreen యొక్క అభివృద్ది ప్రక్రియ ఒక విజయవంతమైన అంతర్జాతీయ సహకారానికి మంచి ఉదాహరణ. RETScreen కెనడా యొక్క వారెన్నెస్, క్యుబెక్ లోని CanmetENERGY పరిశోధన కేంద్రం నేచురల్ రిసోర్సెస్ ద్వారా పరిశ్రమ, ప్రభుత్వం మరియు విద్యారంగ నిపుణుల ఒక అంతర్జాతీయ నెట్వర్క్ మద్దతుతో కెనడా ప్రభుత్వంచే అభివృద్ధిపరచటం మరియు నిర్వహించటం జరుగుతున్నది. ప్రధాన భాగస్వాములలో నాసా (NASA), రెన్యువబుల్ ఎనర్జీ మరియు ఎనర్జీ ఎఫీసియెన్సీ పార్ట్నర్షిప్ (REEEP), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటి (GEF).

భాగస్వాములు
ముగింపు

RETScreenతో, ఉష్ణోగ్రత మార్పుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కీలకమైన అంశమైన కాలుష్యరహిత ఎనర్జీ సాంకేతికత అభివృద్ధిలో కెనడా అగ్రస్థానంలో ఉంది. తాను సాధించిన విశిష్ట విజయాల కారణంగా అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన RETScreen రెన్యువబుల్ ఎనర్జీ సాంకేతికతల ప్రపంచ మార్కెట్టును విస్తృతపరుస్తున్నది మరియు శక్తివంతం చేస్తున్నది, ఎనర్జీ ఎఫీషియెంట్ చర్యలను ప్రోత్సహిస్తున్నది మరియు నిరంతరం కొనసాగే ఎనర్జీ భవిష్యత్తుకు దోహదపడుతున్నది. ఉష్ణోగ్రత మార్పును పరిష్కరించేందుకు మరియు పర్యావరణాన్ని మరింత సంరక్షించేందుకు ప్రపంచం ముందుకు కొనసాగుతున్న ఈ తరుణంలో, ఈ ప్రయత్నానికి కెనడా దేశంలో మరియు విదేశాలలో సహాయం అందించాలనే ఉద్దేశంతో ఉన్నది. మా వెబ్ సైట్ నుండి మీరు సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని మరియు RETScreen యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలని మేము ఉత్తేజపరుస్తున్నాము.

మరియు, ఉచిత సాఫ్ట్ వేర్ విలువ పట్ల మీరు సంతృప్తి చెందితే, దయచేసి RETScreenను మీ స్నేహితులు మరియు సహచరులతో పంచుకోవాలని కోరుతున్నాము.